13న ఊర పండగ
సర్వ సమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రతి యేటా ఆషాడ మాసంలో నగరంలో నిర్వహించే ఊర పండగ ఈనెల 13న నిర్వహించనున్నట్లు సర్వ సమాజ్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే యేండల లక్ష్మీనారాయణ తెలిపారు. నగరంలోని సిర్నాపల్లి గడిలో పండుగ సన్నాహక సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఊర పండుగను పురస్కరించుకొని నగరంలోని ఖిల్లా చౌరస్తా నుంచి పెద్దబజార్, ఆర్య సమాజ్, గోల్ హనుమాన్ మీదుగా వినాయక్ నగర్ వరకు గ్రామదేవతల...