నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గావ్ ఛలో.. బస్తీ ఛలో.. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ నగర శివారు లోని మాధవ్ నగర్ లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, స్థానిక తాజా మాజీ కార్పొరేటర్ ప్రమోద్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
