బార్ ప్రధాన కార్యదర్శిగా మానిక్ రాజు ఎన్నిక

0 12,419

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ 2025-26 వార్షిక  ఎన్నికలు శుక్రవారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. ఉదయం పదిగంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగన్నరకు ముగిసింది. మొత్తం392 ఓట్లలో 322 ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను లెక్కించగా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన దిలీప్, రేంజర్ల సురేష్ లకు సరి సమానంగా  157 వచ్చాయి. ఇద్దరిని ఉపాధ్యక్షులుగా ఎన్నికల అధికారులు జె.వెంకటేశ్వర్, ఆర్. ఎస్.ఎల్ గౌడ్,ఎర్రం విగ్నేష్, బిట్ల రవి, మధుసూదన్ గౌడ్ ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి  పోటీలో నిలిచిన బట్టు మానిక్ రాజు కు 165 సాధించి 65 ఓట్ల మెజారిటీతో భాస్కర్ రెడ్డి ని ఓడించారు. భాస్కర్ రెడ్డి కి కేవలం100 ఓట్లు మాత్రమే వచ్చాయి. బాలరాజ్ నాయక్ 50 ఓట్లకే పరిమితయ్యారు. సంయుక్త కార్యదర్శిగా ఝాన్సీరాణి 179 ఓట్లు రాగా సత్యనారాయణ గౌడ్ కు 140 మాత్రమే పోలయ్యాయి.39 ఓట్ల ఆధిక్యంతో గౌడ్ ను ఆమె మట్టికరిపించారు. ఉపాధ్యక్షునికి పోలైన ఓట్లను లెక్కించగా  సురేష్, దిలీప్ మధ్య  అటూఇటూగా గెలుపు, ఓటమి దోభుచులాడి ఇద్దరికి 157 సరిసమానంగా రావడంతో ఉత్కంఠ భరితంగా నిలిచాయి.

  • బార్ పూర్తిస్థాయి కార్యవర్గం..

నిజామాబాద్ బార్ అసోసియేషన్ పూర్తిస్థాయిలో ఆఫీస్ బేరర్స్,కార్యవర్గం ఏర్పడినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అధ్యక్షుడు గా మామిల్ల సాయరెడ్డి ఎన్నికయ్యారని వివరించారు. కోశాధికారిగా నారాయణ దాసు, సాంస్కృతిక, క్రీడా కార్యదర్శిగా మంజిత్ సింగ్, లైబ్రరీ కార్యదర్శిగా శ్రీమాన్, మహిళ ప్రతినిధిగా రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం విధితమేనని వారు వెల్లడించారు. కార్యవర్గ సభ్యులుగా మద్దెపల్లి శంకర్, భిక్షపతి, ఆయుబ్, మోబిన్, అరేటి నారాయణ, సయ్యద్ ఇంతియాజ్, సుజిథ్ కుమార్, ప్రవీణ, వెంకటేష్, అఖిల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అన్నారు. నూతన బార్ కార్యవర్గానికి న్యాయవాదులు పూలమాలలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.