29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

హత్య కేసులో ఇద్దరికి జీవితఖైదు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: 
ఒక వ్యక్తిని హత్య చేసిన కేసులో ఇద్దరికి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల శుక్రవారం సంచలన తీర్పు వెలువరించారు. నిజామాబాద్ నగరంలోని నాగారం బ్రాహ్మణ కాలోనికి చెందిన షేక్ మజీద్ ను హత్యచేసిన షేక్ జుబిర్ కు,హత్యకు సహకరించిన షేక్ అతీక్ లకు జీవితకారాగార శిక్ష విదించారు.ఎల్లమ్మ గుట్టకు చెందిన షేక్ జుబిర్ భార్యను ఒక గంట పంపిస్తే నీకు రెండు వేల రూపాయలు ఇస్తానని షేక్ మజీద్ ఒక సమయంలో అన్నాడు. చీటికీ మాటికి పోన్ చేస్తు వేదించేవాడు.ఇతని వేధింపులు భరించలేక తన చిన్న నాన్న అయిన ఎల్లమ్మ గుట్ట వాసి షేక్ అతీక్ ను తన అటోలో వెంట పెట్టుకుని 29 దిశంబర్ 2021 న నాగారం లోని బహ్మణ కాలోనికి వెళ్లి మజీద్ ను అటోలో తీసుకుని డిచ్ పల్లి మండల శివారులోని బర్ది పూర్ గ్రామ కు వెళ్లి కళ్ళు తాగిన మత్తులో ముగ్గురు ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యారు.తన భార్య పట్ల అవమాన కరంగా మాట్లాడం భరించలేని షేక్ జుబీర్ అటోలో తనతోపాటు కూర్చున్న మజీద్ ను వెంట తెచ్చుకున్న చాకు తో కడుపులో పొడిచాడు.ఆటోను అపిన షేక్ అతీక్ మజీద్ ను వెనుక బలంగా పట్టుకున్నాడు, తిరిగి జుబీర్ మల్లి కత్తితో పొడిచి హత్యచేసి బార్డిపూర్ గ్రామ శివారులో ని కాలువలో పడవేశారనే నేర అభియోగాలు కోర్టు న్యాయ విచారణలో రుజువు కావడంతో ముద్దాయిలు ఇద్దరికి హత్య కేసులో జీవిత ఖైదు రెండు వేల రూపాయల జరిమాన, సాక్ష్యాలను లేకుండా చేయడం అనే నేరం ప్రకారం ఏడేళ్ల కఠిన జైలుశిక్ష విధిస్తు సెషన్స్ జడ్జి సునీత తీర్పు చెప్పారు.

More articles

Latest article