జోరుగా కల్తీకల్లు వ్యాపారం
చోద్యం చూస్తున్న ఎక్సైజ్ అధికారులు మండల కేంద్రంలో గల్లీకో కల్లు దుకాణం బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలో జోరుగా కల్తీ కల్లు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతుంది. ప్రోభీషన్ ఎక్సైజ్ అధికారుల నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు మండలంలో కొనసాగుతున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వం వ్యాపారస్తులను అధికారులను మూకుమ్మడిగా చేసి వ్యాపారాన్ని యథేచ్చగా కొనసాగించారు.ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం సైతం వీటి విషయంలో నివారణ చర్యలు చేపడుతారన్న ప్రజల అభిప్రాయానికి ఏ...