24.7 C
Hyderabad
Monday, August 3, 2026

తడపాకల్ లో ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: మండలం తడపాకల్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వ్యక్తులు తమ ఆరోగ్యం బాగాలేక అనారోగ్యంతో హాస్పిటల్ లొ చికిత్స పొంది ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న మట్టెల రాజలింగం 51000/, సుద్దాల సౌజన్య 32000/, ఎగల్దంటి రాజేష్ 24000/, బిస్సు సరిత 23000/ ల రూపాయల చెక్కులను వారికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ మా కుటుంబా లకు ఆర్థికంగా ఇబ్బందుల పాలు కాకూడదని
సీఎంఆర్ఎఫ్ మంజూరుకు కృషి చేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ
కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article