23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజా పాలన విజయోత్సవాలు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: ప్రజా పాలనలో విజయోత్సవాల్లో భాగంగా గ్రామీణ ప్రాంత వ్యవసాయ ఆధారిత ఉపాధి రంగాలకు ప్రోత్సాహం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా మోర్తాడ్ మండలంలోని డోన్ పాల్ గ్రామంలో ముత్యాల బాజమ్మ కు రూ. లక్ష వ్యయంతో పశువుల పాక మంజూరు చేయడం జరిగింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ అంగన్వాడీ టీచర్ సుజాత సుమలత గ్రామీణ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article