- రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రజా పాలన విజయోత్సవాలు మన ఊరిలో పనుల జాతర కార్యక్రమం లో భాగంగా ముఫ్కల్ మండలం కొత్తపల్లి గ్రామంలో సమ జైడి నర్సారెడ్డి యొక్క గేదెల శెడ్డుకు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రెడ్డి మాట్లాడుతూ బిజెపి టిఆర్ఎస్ నాయకులు గత వారం రోజులుగా రైతులను తప్పుదోవ పట్టిస్తూ అబద్ధాపు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రైతుల వద్దకు వెళుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల భయానికి గురైన రైతులు ఆందోళనతో ప్రైవేటు వ్యక్తులకు వారి వడ్లను అమ్ముకోవడం జరిగిందని ,ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించిన రైతులు నష్టపోవడం జరిగిందని అన్నారు. ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారొ టిఆర్ఎస్, బిజెపి నాయకులు చెప్పాలని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు సోదరులు టిఆర్ఎస్ బిజెపి నాయకులు నమ్మవద్దు అని, ఎవరు అధైర్య పడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఆలస్యమైన గాని కచ్చితంగా పూర్తి చేస్తుందని దానికి ఉదాహరణని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం గాని, 500కే గ్యాస్ సిలిండర్ గాని, ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా గాని ,10 లక్షల వరకు ఆరోగ్య శ్రీ చేయడం జరిగిందని, అదేవిధంగా రైతు రుణమాఫీ చేయడం జరిగిందని తెలిపారు. రుణమాఫీ కాని వారికి రెండు లక్షల పైచిలుకు రుణమున్నవారికి మాఫీ చేసే విధంగా ప్రాణాళిక సిద్ధం చేయడం జరుగుతుందని అన్నారు. త్వరలోనే అందరికీ రైతు రుణమాఫీ చేయడం జరుగుతుందని, రైతుబంధు వేయడం జరుగుతుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ప్రతిపక్షాలుగా బిజెపి, టీఆర్ఎస్ నాయకులు రైతులకు అబద్ధపు మాటలు చెప్పి వారిని మోసం చేయవద్దని వారికి హితవు పలికారు. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులలో తమ వంతుగా పాలుపంచుకోవాలి కానీ అబద్ధాలు చెబుతూ ప్రజల నష్టానికి కారకులు కావద్దని హెచ్చరించారు. గత ప్రభుత్వం చేసిన విచ్చిన్నత వల్లే పథకాలు అమలు చేయడంలో కొంత ఆలస్యం జరుగుతుంది కానీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందని మానల మోహన్ రెడ్డి అన్నారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మొహినోద్దీన్,వేల్పూరు మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం రెడ్డి, ముప్కళ్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం రెడ్డి,సొసైటీ అధ్యక్షులు జాక్క రాజేశ్వర్,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవి, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం సాగర్,రాజ్ కుమార్ సుంకరి,మహేష్,జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిట్యాల శ్రీనివాస్,రాజ్ వెంకట్ రెడ్డి,రాకేష్,రాజ రెడ్డి,లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

