నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు నిర్వహిస్తున్న దోస్త్ 2026-27 మూడవ విడతలో ఎన్ సిసి, స్పోర్ట్స్ దివ్యాంగుల ప్రత్యేక విభాగాల ధృవ పత్రాల పరిశీలన సోమవారం నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎన్ సిసి 19, స్పోర్ట్స్ 10, దివ్యాంగులు 3, మొత్తం 32 మంది విద్యార్థులు ధృవ పత్రాల పరిశీలనకు హాజరైనట్లు యూనివర్సిటీ దోస్త్ సమన్వయకర్త డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ సిసి అధికారి లెఫ్ట్ నెంట్ డాక్టర్ రామస్వామి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి.ఆర్.నేత, దిలీప్, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
