27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా చింతల కిషన్

Must read

📰 Generate e-Paper Clip

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా చింతల కిషన్‌ను నియమించినట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం నూతనంగా నియమితులైన మండల అధ్యక్షుడు చింతల కిషన్‌కు ఆయన నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చింతల కిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు కాటిపల్లి నాగేష్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తీర్మాన్ పల్లి సర్పంచ్‌గా పనిచేసిన తనకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని కిషన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పూజ్యం రవికుమార్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article