Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 March 2025, 2:15 pm Posted by : ramakrishna

పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న వేణురాజ్

న్యూఢిల్లీ, బతుకమ్మ: ఇండియా అలయన్స్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన, పార్లమెంట్ మార్చ్ లో ఎన్ ఎస్ యూ ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకట స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణురాజ్రాహుల్ యాదవ్ పాల్గొన్నారు. బీజేపీ అవలంబిస్తున్న జాతీయ విద్యా విధానం యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ -2020, విద్యా కాషాయీకరణ తదితర అంశాలను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన సభా కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ లో పాల్గొన్న వేణురాజ్ తోపాటు నాయకులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Venuraj participated in the Parliament march.