భీమ్ గల్, బతుకమ్మ : మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకులను శుక్రవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంలోని మండల కేంద్రాలు, గ్రామాల్లో కేక్ లు కట్ చేసి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభివృద్ధే తన అభిమతంగా పని చేసే నేతకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుడిని వేడుకొన్నారు. అనంతరం హైదరాబాద్ కు తరలివెళ్లి వేములను ఆయన నివాసంలో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి వేముల ప్రశాంత్ రెడ్డి హోలీ ఆడారు.

