29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఘనంగా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుక

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ  : బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. వేముల జన్మదిన సందర్బంగా బాల్కొండ నియోజకవర్గంలోని   బీఆర్ఎస్ నాయకులు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో కేకులు కట్ చేసి, దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తమ నేతకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి వేడుకున్నారు. అనంతరం   నాయకులు హైదరాబాద్ తరలివెళ్లారు. అక్కడ మాజీ మంత్రి స్వగృహంలో నాయకులు, కార్యకర్తలు  కలిసి స్వయంగా ప్రశాంత్ రెడ్డి తో కేక్ ను కట్ చేయించారు. పుష్ప గుచ్ఛాలు అందజేసి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హోలీ పండుగలో నాయకులు, కార్యకర్తలు,అభిమానులతో కలిసి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నాడు. రంగులు పూసి రంగోలి ఆడారు.

More articles

Latest article