నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
ఫిలిప్పీన్స్ దేశంలో జరిగిన రోడ్డు ప్రమాదం నిజామాబాద్ కు చెందిన వైద్య విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వేల్పూరు మండల కేంద్రంకు చెందిన అక్షయ్ ఫిలిప్పీన్ లో ఎం.బి.బి.ఎస్. పైనల్ ఇయర్ చదువుతున్నాడు. బైక్ పై వెళ్తున్న అక్షయ్ వాహనాన్ని రాంగ్ రూట్ లో వచ్చి మరో వాహనం డికోట్టడంతో ఈ ప్రమాధం జరిగింది. ఈ ప్రమాధంలో అక్షయ్ తో పాటు మరేవరు ఐనా ప్రమాదం బారీన పడిన విషయం తెలియరాలేదు.మరో 6 నెలల్లో ఎం.బి.బి.ఎస్. పట్టా అందుకొనున్న తరుణం లో విషాదం చోటు చేసుకుంది. అక్షయ్ మృతి తో ఆయన స్వగ్రామం వేల్పూరు లో విషాదం చోటు చేసుకుంది.
