26.3 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందల్వాయి  లో జమ్మిచెట్టు గద్దె నిర్మాణానికి భూమి పూజ చేసిన విడీసీ

Must read

📰 Generate e-Paper Clip

–గద్దె నిర్మానానికి విరాళాలుకోసం  గ్రామస్తులు ముందుకు రావాలి

ఇందల్వాయి,బతుకమ్మVDC performed Bhumi Pooja for construction of Jammichettu Gadde in Indalwai
ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో శుక్రవారం ఉదయం  జమ్మి చెట్టు వద్ద గద్దె నిర్మించడానికి వీడిసి బృందం ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు కందాలై రాజగోపాల చారి పూజార్చనతో భూమి పూజ నిర్వహించారు. అనంతరం విడీసీ చైర్మన్ జితేందర్ మాట్లాడుతూ జమ్మిచెట్టు వద్ద గద్దె నిర్మించడానికి విరాళాలు ఇచ్చేవారు గ్రామస్తులు ఎవరైనా సరే ముందుకు రావాలని కోరారు. గద్దె నిర్మించడానికి డబ్బులు అధిక మొత్తంలో కావలసింది కాబట్టి గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు జనార్ధన్, సాయిలు, శ్రీనివాస్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

More articles

Latest article