24.1 C
Hyderabad
Monday, August 3, 2026

పి ఆర్ టి యు  నందిపేట్ మండల అధ్యక్షుడిగా భూషణ్ 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నందిపేట్.
పిఆర్ టియు టి ఎస్ నందిపేట్ మండల అధ్యక్షుడిగా నికాల్పూర్ గ్రామ వాసి ఏ భూషణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. హోరహోరిగా సాగిన ఎన్నికల్లో మల్లారం ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాడిగా విధులు నిర్వహిస్తున్న భూషణ్ గెలుపోందారు. భూషణ్ ఇదివరకు  పిఆర్ టియు మండల ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శిగా జే రమేష్ అసోసియేట్ అధ్యక్షుడిగా ఎస్. మైఖేల్ ఉపాధ్యక్షుడిగా వై.వినోద్ కుమార్ ,కార్యదర్శిగా అన్వర్, మహిళా ఉపాధ్యక్షులుగా శ్రీదేవి, మహిళా కార్యదర్శిగా పద్మ  ఎన్నిక య్యారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు జి కిషన్, జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర గౌడ్ వివిధ మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్షులు ఉపాధ్యాయలు పాల్గొన్నారు

More articles

Latest article