26.2 C
Hyderabad
Monday, August 3, 2026

వామనరావు దంపతుల హత్య కేసు  సీబీఐకి అప్పగింత

Must read

📰 Generate e-Paper Clip

తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ను  సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పెద్దపల్లి జిల్లా మంథనిలో 2021 ఫిబ్రవరి 17న రామారావు నాగమణి కారులో వెళ్తుండగా అడ్డగించి, నడిరోడ్డుపై కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐ కి ఇవ్వాలని వామనరావు తండ్రి కిషన్ రావు సెప్టెంబర్ 18 సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి ఇస్తే తమకు అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈనేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే కిషన్ రావుకు భద్రత కల్పించాలని ఆదేశించింది

More articles

Latest article