26.7 C
Hyderabad

జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం

Must read

📰 Generate e-Paper Clip

ముగ్గురు సభ్యులతో ప్యానెల్ ఏర్పాటు చేసిన స్పీకర్ ఓం బిర్లా

వెబ్ న్యూస్, బతుకమ్మ : జస్టిస్ యశ్వంత్ వర్మపై  అభిశంసన తీర్మానాన్ని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్వీకరించారు.   ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్యానెల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే మణిందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్యులు ఈ ప్యానెల్ లో సభ్యులుగా ఉన్నారు.

More articles

Latest article