. . . ఎస్ టీ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
విద్యా శాఖలో ఎంఈఓ, డిప్యూటీవో, డైట్ లెక్చరర్ పోస్టులన్ని కూడా ఖాళీగా ఉన్నాయని, వెంటనే ఈ ఖాళీలన్నిటిని అర్హత గల ఉపాధ్యాయుతో భర్తీ చేయాలని ఎస్ టీ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ అన్నారు. నగరంలోని ఎస్ టీ యు భవన్ లో శనివారం జిల్లా ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా తొందరగా పీఆర్ సీని అమలు చేయాలని కోరారు. మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలను అమలు చేయాలని, పెండింగ్ డీఏ లను వెంటనే ప్రకటించాలని కోరారు. అనంతరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి సాబేర్ మాట్లాడుతూ కేజీబీవీ, మోడల్ స్కూల్స్ ఉపాధ్యాయుల సమస్యలని కూడా వెంటనే పరిష్కరించాలని, సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని, సమ్మె కాలం వేతనాలు చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి ధర్మేందర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, బెల్లాల్ శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు అఫ్జల్ బెగ్, మహేశ్వర్, మల్లయ్య సాయిబాబా, కృష్ణ సురేందర్ సీనియర్ నాయకులు నారాయణ, పవన్ కుమార్ వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.