ఐపీఎల్ లో ఐడిలది ‘ ఇది సంగతీ ’

0 19,878

 

. . . నిజామాబాద్ కేంద్రంగా బెట్టింగ్ కోసం ఐడిల జారీ

 

. . .  షాడో ఆఫీసర్ తో ప్రధాన బూకీకి సాంగత్యం

 

. . . ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ ‘ సంగతీ ’ అంతా జగదీషుడికే ఎరుక

 

. . . ఐపిఎల్ పోరుకు ముందే ఆన్ లైన్ లో ఐడిలను ఇస్తున్నబుకీలు

 

నిజామాబాద్, బతుకమ్మ:

 

ఐపిఎల్ సీజన్- 19 శనివారం దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. మే -31 వరకు క్రికేట్ మేనియా అవహించనుంది. ఇటివలనే టీ 20 వరల్డ్ కప్ ను ఇండియా గెలిచింది. ఇప్పుడు అదే ఫార్మాట్ లో జరిగే పొట్టి క్రికెట్ ఇండియన్ ప్రీమీయర్ లీగ్ ఫీవర్ యూత్ ను పట్టుకుంది. టీ20 వరల్డ్ గెలిచిన సంబరాలు చేసుకుని ఇరవై రోజులు గడువకముందే వచ్చిన ఐపిఎల్ యూత్ ను షేక్ చేస్తుంది. క్రికెట్ జాతీయ క్రీడా కాకున్నప్పటికీ ఇండియాలో దానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. క్రికెటర్ లను దేవుళ్లతో పోల్చుకునే కల్చర్ ఇక్కడ సొంతం. ఇదంతా నాణానికి ఒకవైపు కాగా క్రికెట్ మ్యాచ్ లు ప్రారంభం మొదలుకొని ఫైనల్ మ్యాచ్ వరకే జరిగే బెట్టింగ్ లు ఇప్పుడు సాధరణ పౌరులు మొదలుకొని యువత జీవితాలను చిన్నభిన్నం చేస్తున్నాయి. ఇక అన్ లైన్ లో బెట్టింగ్ లు ప్రారంభం మొదలుకొని చివరి మ్యాచ్ వరకు కోట్లు చేతులు మారుతున్నాయి. ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం అప్పులు చేసిన వారు కొందరైతే, సర్వస్వం కోల్పోయి ప్రాణాలు తీసుకున్నవారు మరికొందరు. మరికొందరైతే బెట్టింగ్ ల కోసం చేస్తున్న నేరాలు వ్యవస్థను భయపేడుతున్నాయి. గతంలో ప్రభుత్వం వందలాది బెట్టింగ్ యాప్ లను నిషేదించింది. నిర్వాహకులు మాత్రం కేవలం డబ్బుల కోసం టెలిగ్రాం, వాట్సప్, ఇన్ స్ట్రాగ్రాం లాంటి యాప్ ల ద్వారా దందాలను చెలాయిస్తున్నారు. ప్రస్తుతం నిఘా వర్గాలు అన్ లైన్ నగదు మార్పిడి(యూపిఏ చెల్లింపులు, బ్యాంకుల లావాదేవి) లను పసిగట్టుతుండటంతో నేరుగా డబ్బులు తీసుకుని ఐడిలను ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు నిజామాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం ప్రధాన సూత్రదారి ఐడిలను జారీ చేస్తున్న ‘ సంగతి ’ వెలుగుచూసింది.

 

IDs in IPL are 'This is the party'

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన బూకీ ఒక్కరు పక్కాగా ఐడిలను ఇస్తున్నారు. ప్రధానంగా శాంతినగర్ చౌరస్తాలో హోటల్ వద్ధ, అసద్ బాబా నగర్ లో, మాలపల్లి చౌరస్తాలో హోటల్ వద్ధ, చంద్రశేఖర్ కాలనీ, ఎల్లమ్మగుట్టకు చెందిన సబ్ ఏజంట్ల ద్వారా ఆన్ లైన్ బెట్టింగ్ ఐడిల జారీ ప్రక్రియ షూరు అయింది. నగరంలోని న్యాల్ కల్ రోడ్డుకు చెందిన ఓ పాత నేరస్థుడు ( నిజామాబాద్ ఒకటవ టౌన్ లో నమోదైన సైకిల్ చోర్, జేబు దోంగ) తరువాత గంజాయి బ్యాచ్ తో సోపతితో అన్ లైన్ బెట్టింగ్ వైపు అడుగులు వేశాడు. హైదరాబాద్ లో ఒక వైన్స్ షాపులో యాజమానికి సంబంధించిన(10 లక్షలతో) పరారై నిజామాబాద్ కు వచ్చి గంజాయి బ్యాచ్ లో చేరాడు. గంజాయి బ్యాచ్ గంజాయి దందా చేసుకుంటే అతడు మాత్రం ఆన్ లైన్ బెట్టింగ్ (క్యాసినో) ఐడిల సంగతి చూసుకోవడం మొదలుపెట్టాడు. తొలుత ఎల్లమ్మగుట్ట, చంద్రశేఖర్ కాలనీకి చెందిన యువతను సబ్ ఏజంట్ లుగా నియమించుకుని ఐడిల జారీలో ప్రధాన బూకీగా ఎదిగాడు. నేరుగా తాను ఐడిలు జారీ చేస్తున్న విషయం పోలీసులకు చేరడంతో కొందరు గంజాయి బ్యాచ్ ద్వారా పోలీసులతో దోస్తానా కొనసాగిస్తున్నాడు.

 

IDs in IPL are 'This is the party'

 

తాను చెప్పిందే పోలీసులు వింటారని వారి ఇండ్లకు తొలుత మాంసం సరఫరా(మేక తొడ సప్పలను) చేసి మెప్పు పోందాడు. దాని తరువాత దోస్తానా ముదిరి ఇప్పుడు వారితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. హైదరాబాద్ పాసీంగ్ సీజీంగ్ బుల్లెట్ బండిపై నేరుగా పోలీస్ స్టేషన్ లకు వెళ్లి సెటిల్ మెంట్ కు దిగాడు. నేరుగా ఆన్ లైన్ బెట్టింగ్ ల ద్వారా సంపాదనలో వాటాలు ఇస్తూ వారిని బుట్టలో వేసుకున్నాడు. ముజాహీద్ నగర్ లో పీలా స్కూల్ వద్ధ చోర్ బబ్లూ, రైల్వే స్టేషన్ వద్ధ గున్న, మాలపల్లి ప్రాంతాలలో అప్రోజ్ లను, చంద్ర శేఖర్ కాలనీలో ఇర్పాన్ అనే వాళ్లను బూకిలను పెట్టి నిత్యం వందల ఐడిలను జారీ చేస్తున్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ఇస్తు అచీర కాలంలో ప్లాట్లు, కార్ లను కొనుగోలు చేసి  మూడవ టౌన్ ప్రాంతంలో ఒక ముసలీ దంపతుల, న్యాలకల్ రోడ్డులో ఒక సోసైటి చైర్మెన్ స్ధలాన్ని కబ్జా చేశారు. తన వద్ద ఉన్న సబ్ ఏజెంట్లు( బూకీల) పేర్ల మీదనే భూములను చెరబట్టి పోలీస్, రెవెన్యూ అండాతో కబ్జాలో కుర్చున్నాడు.

 

IDs in IPL are 'This is the party'

 

నిజామాబాద్ నగరంలో పాత నేరస్తుడు లీగల్ ముసుగులో చేస్తున్న ఆన్ లైన్ బెట్టింగ్ దందాకు ఓ ఎస్సై అండదండలు పుష్కలంగా ఉన్నాయనే టాక్ ఉంది. గంజాయి బ్యాచ్ లీడర్ ద్వారా ఎస్సైని పరిచయం చేసి ఐడిల దందాలో మిగిలిన సొమ్మును వాటాలు చేసుకుని పంచుకుంటారని ఎవరిని అడిగినా చెబుతారు. తనకు తాను షాడో అధికారిగా చెలామాణి అవుతున్న సదరు ముదురు ఎస్సై ప్రధాన బూకిపై ఈగ వాలకుండా కాపాడుతున్నట్లు అంతా కోడైకూస్తోంది. పాత నేరస్తుడు బెట్టింగ్ బంగార్రాజుకు పిఎస్ లలో ఎర్రతివాచీ పరుచడానికి గంజాయి బ్యాచ్ అండదండలతో పాటు కానిస్టేబుల్ నుంచి ఎస్సైగా ఎదిగిన ముదురు కుడా ఒక కారణం అని ఆన్ లైన్ బెట్టింగ్ లో ఐడిలను ఇస్తున్న చోట ఏజంట్లు బహిరంగంగా చెబుతున్నారు.

 

IDs in IPL are 'This is the party'

 

సదరు పాత నేరస్తుడు రిజిస్ట్రేషన్ లేని బుల్లెట్ పై గంజాయి బ్యాచ్ తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతుండటంతో పాటు ఏకంగా పోలిస్ కార్యాలయంలోకి రాకపోకలు సాగిస్తు మూడో కంటికి తెలియకుండా ఆన్ లైన్ బెట్టింగ్ ను నిర్వహిస్తున్నా పోలీస్ నిఘా వర్గాలు నిద్రపోతున్నాయో లేదా అనే విషయం అ జగదీషుడికే ఎరుక అని చెప్పాలి. ఇటీవల కాలంలో షాడో అదికారి( ముదురు ఎస్సై), ఆన్ లైన్ బెట్టింగ్ సూత్రాదారి ఫ్యామీలి టూర్ వ్యవహరం అంతా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ నిఘా వర్గాలు పోలీస్ బాస్ కు తెలియకుండా జాగ్రత్త పడ్డారనే చర్చ జోరుగా జరుగుతంది. ఈ  ఐపీఎల్ సీజన్ లోనే కోట్లు సంపాదించాలని ఆన్ లైన్ బెట్టింగ్ కు ఏజంట్లను పెంచి మరీ ప్రారంభానికి ముందే ఐడిలు జారీ చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల భోగట్టా. శనివారం హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఆన్ లైన్ బెట్టింగ్ ముఠాలకు ఘాటైన వార్నింగ్ ఎక్స్ వేదికగా ఇవ్వగా నిజామాబాద్ లో మాత్రం ఓపెన్ గానే ఆన్ లైన్ ఐడిల జారీ జరుగుతుండడం విస్మయం కలిగిస్తోంది.

 

IDs in IPL are 'This is the party'

Leave A Reply

Your email address will not be published.