29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఉట్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల తనిఖీ

Must read

📰 Generate e-Paper Clip

 బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని ఉట్పల్లి గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సబ్‌ కలెక్టర్ వికాస్ మాతో సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించడంతో పాటు, బోధన సిబ్బంది, బోధన్ సిబ్బంది హాజరు రిజిస్ట్రర్లను పరిశీలించారు. విద్యా సంబంధిత రికార్డుల నిర్వహణను కూడా సమీక్షించారు. ఆ తరువాత విద్యార్థులతో మమేకమై, వారు ఇటీవల నేర్చుకున్న పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగి వారి అవగాహన స్థాయిని అంచనా వేశారు. ఇంకా ముందుకు మాట్లాడుతూ, బేస్‌లైన్ పరీక్ష నిర్వహణ వివరాలు, అసైన్‌మెంట్ల పూర్తి స్థితిపై విచారణ జరిపారు. ఉపాధ్యాయులు నియమిత హాజరు, సమర్థవంతమైన బోధన పద్ధతులు, విద్యార్థుల సమయానుకూల మూల్యాంకనం పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. బోధన్ సబ్‌ కలెక్టర్ వికాస్ మాతోఈ పర్యటనతో పాఠశాల విద్యా ప్రమాణాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు.

Utpally Government Primary School Inspection

More articles

Latest article