బతుకమ్మ, వెబ్‌డెస్క్
ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్రైవేట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. రెండు దేశాలు గత కొద్ది రోజులుగా ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలు జరిపే సమయం దాటిపోయిందని, ఇరాన్‌పై చర్యలు అనివార్యమని అధ్యక్షుడు ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడిరచారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌పై అమెరికా దాడి ఖాయంగా తెలుస్తోంది. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్రైవేట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే, తుది ఉత్తర్వులు మాత్రం ఇంకా ఇవ్వలేదని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేస్తోంది.
