ఇరాన్‌పై దాడికి అమెరికా గ్రీన్ సిగ్నల్!
బతుకమ్మ, వెబ్‌డెస్క్ ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై దాడికి ట్రంప్ ప్రైవేట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. రెండు దేశాలు గత కొద్ది రోజులుగా ఒకరిపై ఒకరు క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌పై దాడికి అగ్రరాజ్యం అమెరికా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. చర్చలు జరిపే సమయం దాటిపోయిందని, ఇరాన్‌పై చర్యలు అనివార్యమని అధ్యక్షుడు ట్రంప్ సూచనప్రాయంగా వెల్లడిరచారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరాన్‌పై అమెరికా దాడి...