25.4 C
Hyderabad

ఉరేసుకొని హమాలి ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

జుక్కల్, బతుకమ్మ :  కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని బిజ్జల్ వాడికి చెందిన మారుతి హమాలీ ఉరిసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు  ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. బిజ్జల్ వాడికి చెందిన మారుతితోపాటు అతడి ఇద్దరు సోదరులు నిజామాబాద్ లోని మిల్లులో హమాలీ పని చేస్తున్నారు. ఇటీవలే సొంత గ్రామానికి వచ్చారు. పని చేసే చోట వదిలి వచ్చిన సామగ్రిని తీసుకువస్తానని ఇంటికి నుంచి వెళ్లిన మారుతి తిరిగి రాకపోవడంతో ఈనెల 1వ తేదీన అతడి తమ్ముడు యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా 7వ తేదీన హంగర్గా శివారులోని టేకు చెట్టుకు మారుతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు సమాచారం అందించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తమ్ముడు యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

More articles

Latest article