27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

‘ముప్ప’ గుప్పిట్లోకి ప్రభుత్వ స్థలం

Must read

📰 Generate e-Paper Clip

  • భవానీనగర్ కాలనీవాసుల ఆరోపణ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ప్రభుత్వ స్థలానిన కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని నగరంలోని భవానీనగర్ కాలనీవాసులు ఆరోపించారు. వినాయక్ నగర్ భవానీనగర్ కాలనీలో నార్త్ ఫేస్ ఇంటిని నిర్మిస్తున్న గంగారెడ్డి, ఆయన ఇంటి వెనుకాల వైపు ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే వెనుక వైపు గేటును ఏర్పాటు చేశాడని కాలనీవాసులు అంటున్నారు. ఈ విషయమై ప్రశ్నిస్తే ఎవరేం చేసుకుంటారో.. చేసుకోండి చూద్దా అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపారు.  ఈ విషయమై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

More articles

Latest article