24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మున్సిపల్ అధికారులతో  అర్బన్ ఎమ్మెల్యే సమీక్ష

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ శాఖ కార్యాలయంలో కమీషనర్ ఛాంబర్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  సోమవారం మున్సిపల్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. నగరంలో అహ్మద్ బజారు లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భారీ వ్యయంతో నిర్మించి నిరూపయోగంగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అన్నారు. నెల రోజుల సమయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని మున్సిపాల్ కమీషనర్ ను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు  ఫుట్ ఫాత్ కబ్జాలు, అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని వాటికీ తక్షణమే చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు తెలియజేసారు. స్వచ్ భారత్ దిశగా క్లీన్ సిటీ చేసే బాధ్యత అందరు తీసుకోవాలని కార్పొరేషన్ ను రాష్ట్రంలో ఆదర్శంగా నిలబెట్టాలని అధికారులు బాధ్యతయుతంగా పని చేయాలన్నారు. కార్పొరేటర్ల పదవి కాలం ముగుస్తుండటంతో కౌన్సిల్ సమావేశాలు త్వరలో నిర్వహించి డివిజన్ వారిగా ఉన్న రోడ్స్, డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి తగిన నిధులు మంజూరు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమీషనర్ రాజేందర్,అసిస్టెంట్ కమీషనర్ శంకర్, మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article