పెద్ద కొడప్ గల్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా పెద్దకొడప్ గల్ ప్రభుత్వ ఆస్పత్రిలో అంబులెన్సు అందుబాటులోకి వచ్చింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సోమవారం జెండా ఊపి అంబులెన్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబులెన్సును రోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యుడు ఉమాకాంత్, కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి, మల్లప్ప పటేల్, అహ్మద్, మొగులా గౌడ్, డాక్టర్ సంజీవ్, సంతోష్, బస్వరాజ్ దేశాయ్, నాగనాథ్ పటేల్, జిన్నా రాములు, శంకర్, రషీద్, పండరి, బాల్ రాజ్, మారుతి, నాయక్ చాంద్, యూసుఫ్ పాల్గొన్నారు.
