నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం త్రివేణి సంఘమం సరస్వతి పుష్కరాలలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించిన అనంతరం ముక్తీశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహినిగా కలిసే ఈ పవిత్ర స్థలం తెలంగాణకు ప్రత్యేకం అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంఘమం వద్ద 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సరస్వతి పుష్కరాలలో నది స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలిగి పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం అన్నారు. భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఇది ఒకటన్నారు. తెలంగాణ నలుమూలల నుండే కాకుండా ప్రక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడం విశేషం అన్నారు. సరస్వతి పుష్కరాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.

