త్రివేణి సంఘమంలో స్నానం ఆచరించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం త్రివేణి సంఘమం సరస్వతి పుష్కరాలలో ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కుటుంబ సమేతంగా పుణ్య స్నానం ఆచరించిన అనంతరం ముక్తీశ్వర క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ దక్షిణ కాశిగా పేరొందిన కాళేశ్వరం గోదావరి, ప్రాణహిత నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్వాహినిగా కలిసే ఈ పవిత్ర స్థలం తెలంగాణకు ప్రత్యేకం అన్నారు. కాళేశ్వరం త్రివేణి సంఘమం వద్ద 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే...