26.2 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ:  తెలంగాణలో నకిలీ సర్టిఫికేట్లతో పోలీస్ ఉద్యోగం పొందిన వారి బాగోతం వెలుగు చూసింది. ఏకంగా 59 మంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు పోలీస్ శాఖ తేల్చింది. వీరిపై చర్యలు తీసుకోవాలని అధికారులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ఇప్పటికే వివిధ పోలీస్ ప్రాంతాల్లో సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.  తెలంగాణ పోలీస్ శాఖలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే  చర్చ  జోరుగా సాగుతోంది. తెలంగాణ పోలీస్ ఉద్యోగ నియామకాలు జోనల్, జిల్లా కేటగిరీలుగా ఉంటాయి. ఇందుకు అనుగుణంగా లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులను గుర్తిస్తారు. లోకల్ గా గుర్తించడంలో బోనఫైడ్ సర్టిఫికెట్ కీలకంగా ఉంటుంది.  దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లను సృష్టించి ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. మరికొందరు మాత్రం గుర్తింపు లేని స్కూళ్లలో చదవడం, అవి మూతపడడంతో తప్పని పరిస్థితుల్లో ఇలా చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఈ 59 మంది మాత్రమే ఇలా ఉద్యోగం పొందారా? లేక ఇలా ఇంకా చాలా మంది ఉన్నారా? అన్న అంశంపై కూడా చర్చ సాగుతోంది. ఒక్క పోలీస్ శాఖలో మాత్రమే కాదు, ఇతర విభాగాల్లో కూడా ఇలాంటి అభ్యర్థులు ఉన్నారన్న అభిప్రాయం కూడా నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారి కారణంగా తాము ఉద్యోగాలకు అర్హత పొందలేకపోతున్నామని,  ఈ అంశంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

More articles

Latest article