తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం

వెబ్ న్యూస్, బతుకమ్మ:  తెలంగాణలో నకిలీ సర్టిఫికేట్లతో పోలీస్ ఉద్యోగం పొందిన వారి బాగోతం వెలుగు చూసింది. ఏకంగా 59 మంది నకిలీ బోనఫైడ్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు పోలీస్ శాఖ తేల్చింది. వీరిపై చర్యలు తీసుకోవాలని అధికారులు సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా ఇప్పటికే వివిధ పోలీస్ ప్రాంతాల్లో సివిల్, ఏఆర్‌ కానిస్టేబుళ్లుగా పని చేస్తున్నారు.  తెలంగాణ పోలీస్ శాఖలో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే  చర్చ  జోరుగా సాగుతోంది....