29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సంగం పీవీఎస్‌లో కలకలం 

Must read

📰 Generate e-Paper Clip

  • అధ్యక్షుడు సహా పదిమంది డైరెక్టర్ల రాజీనామా

 

బతుకమ్మ, బోధన్ : బోధన్ మండలంలోని సంగం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీవీఎస్) లో కొనసాగుతున్న సమస్యలను చాటుతూ సభ్యులు సమూహంగా రాజీనామాలు సమర్పించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జాయింట్ కలెక్టర్‌కు తమ రాజీనామా నిర్ణయాన్ని సభ్యులు తెలియజేశారు. సొసైటీ లో నెలకొన్న కష్టసమస్యలపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని సంఘం అధ్యక్షులు ముత్త రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముత్త రెడ్డి తో పాటు పది మంది సొసైటీ డైరెక్టర్లు కూడా రాజీనామాలు సమర్పించగా, స్థానిక వ్యవసాయ వర్గాలలో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Uproar at Sangam PVS

More articles

Latest article