29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫీజు పోరు దీక్ష పోస్టర్ల ఆవిష్కరణ 

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

ఈ నెల 15న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద  ధర్నా చౌక్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగే “ఫీజు పోరు దీక్ష” పోస్టర్లను గురువారం నిజామాబాద్ నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేయకపోవడంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడుతుందని అన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్ షిప్ ల సాధన ధ్యేయంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపుమేరకు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆదివారం రోజున హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో నిర్వహిస్తున్న ఫీజు పోరు దీక్షకు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు మాట్లాడుతూ పేదలకు కావలసినది ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అని అన్నారు. ఈ రెండు ప్రజలకు చేరితే ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని, వారికి ఏ ఇతర సహాయం అవసరం పడదని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, సాయి బసవ, బగ్గలి అజయ్, రేఖ, కోడూరు స్వామి, సురేందర్, శ్రీకాంత్, రుక్మిణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article