ఫీజు పోరు దీక్ష పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఈ నెల 15న హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద ధర్నా చౌక్ లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జరిగే "ఫీజు పోరు దీక్ష" పోస్టర్లను గురువారం నిజామాబాద్ నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ డబ్బులను విడుదల చేయకపోవడంతో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం ఏర్పడుతుందని...