- -కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు…!!
- -గత కెసిఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటే ఈ ప్రభుత్వం రైతులకు గుదిబండగా మారింది..
- -కేసీఆర్ లేకుండా చేయడం కాదు నీ ముఖ్యమంత్రి సీటు కదలకుండా చూసుకో : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో శుక్రవారం కురిసిన వర్షానికి దుబ్బాక మార్కెట్ యార్డులో తడిచిన వరి ధాన్యాన్ని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. తడిసిన వరి ధాన్యాన్ని మద్దతు ధర కు కొనుగోలు చేయాలంటూ కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన జిల్లా పాలన అధికారి మను చౌదరి రైస్ మిల్లలతో మాట్లాడి కొనుగోలు ప్రారంభం అయ్యేలా చేస్తామని కలెక్టర్ తెలిపారు. రెండు రోజులుగా వర్షం కురుస్తుండడంతో ధాన్యం తడిసిపోయింది. కేంద్రాల వద్ద కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో నష్టపోతున్నామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో కురిసిన వర్షానికి మార్కెట్ యార్డు ఆవరణలోని కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆరబోసిన ధాన్యం తడిసింది , ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండేదని రైతు బంధు రైతు బీమా రైతులకు అందించే విధంగా బి ఆర్ ఎస్ ప్రభుత్వం కేసీఆర్ రైతుల ఖాతాలో అందజేసేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదని రైతు బంధు లేదు రైతు బీమా లేకుండా రైతులను ఇబ్బంది చేస్తున్నారని వడ్డారు కొనుగోలు కేంద్రాలు గత ప్రభుత్వంలో రెండు నెలల ముందే రైస్ మిల్లర్లకు అలర్ట్మెంట్ చేసేదని గోడౌన్లను మరియు గన్ని బ్యాగులను ముందుగానే కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడంలేదని కనీసం అధికారులు స్పందించకపోవడం రైతులు వారు పండించిన పంట ఏమైపోతుందని ఆందోళన చెందుతున్నారని ఎప్పుడు హైదరాబాదులో ఉండి రాజకీయం చేయడం కాదని కెసిఆర్ ను ఇది చేస్తాం అది చేస్తాం అనడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతోని ప్రజలను మోసం చేసి పట్టించుకోవడంలేదని దుబ్బాక ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయంతో ని బతికే వాళ్ళు ఉన్నారని దుబ్బాక గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ అని రెండవ ఉద్యమం రైతులతో నే మొదలవుతుందని తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రైతు రుణమాఫీ అని రైతు బంధు అని ఇలా మోసం చేస్తూనే మరోసారి కొనుగోళ్ల విషయంలో కూడా రైతాంగానికి తప్పని నిరాశ కనీసం వ్యవసాయ మార్కెట్ యాడ్లలో ఎక్కడికక్కడ వడ్లు రాశుల ఉండడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని వ్యవసాయం మార్కెట్ లార్డ్ లో ఐకెపి మరియు పిఏసి ద్వారా కొనుగోలు కేంద్రాలు తక్షణమే ప్రారంభించి వర్షాలు వచ్చే సూచన ఉంది కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు వెంటనే గోనె సంచులు తాడిపత్రిలు రైతులకు అందజేయాలి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కన్ను తెరిచి రైతులకు ఒక భరోసా కలిగిస్తూ ఏదైతే ఎన్నికల్లో 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారో వాటితో పాటు కొనుగోలు చేసిన ప్రతి గింజను ఆ బోనస్తో కూడిన డబ్బులు రైతుల అకౌంట్లో వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

