27.4 C
Hyderabad

జర్నలిస్టుల మెగా హెల్త్ క్యాంప్ కు అపూర్వ స్పందన

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో వెల్ నెస్ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రెస్ క్లబ్ హాల్ లో జరిగిన క్యాంప్ లో వెల్ నెస్ హాస్పిటల్ వైద్య బృందం జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాయిరాం, యురాలజీ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ స్పందన ఆధ్వర్యంలో వైద్యం అందించారు. బీపీ, షుగర్, ఈసీజీ 2డీ ఈకో పరీక్షలు నిర్వహించారు. హెల్త్ క్యాంప్ కు సుమారు 150 మంది జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలు హాజర య్యారు. పలువురు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి వైద్య పరీక్షలు చేయించు కున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్ష, కార్యదర్శులు అంతడుపుల రామకృష్ణ, భైర శేఖర్, ఆర్గనైజషన్ సెక్రెటరీ మండే మోహన్, సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు.

Unprecedented response to journalists' mega health camp

Unprecedented response to journalists' mega health camp

More articles

Latest article