జర్నలిస్టుల మెగా హెల్త్ క్యాంప్ కు అపూర్వ స్పందన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆద్వర్యంలో వెల్ నెస్ హాస్పిటల్ సౌజన్యంతో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రెస్ క్లబ్ హాల్ లో జరిగిన క్యాంప్ లో వెల్ నెస్ హాస్పిటల్ వైద్య బృందం జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ సాయిరాం, యురాలజీ వైద్యులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ కిరణ్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్...