27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎనిమిదేళ్ళ బాలుడి అదృశ్యం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని 5 వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల భారతి రాణి కాలోని బాలుడు అదృశ్యమైనట్లు ఎస్ఐ గంగాధర్ తెలిపారు. వివరాలలోకి వెళ్తే నిజామాబాద్ నగరం లోని చంద్రశేఖర్ కాలనీ కి చెందిన సుమయ్య బేగమ్ తన ఎనిమిదేళ్ల కొడుకు అయినా మహమ్మద్ హుస్సేన్ ను నిజామాబాద్ నగరంలోని భారతీరాని కాలనీలో తన అమ్మగారైన సమీనా బేగం ఇంటి వద్ద మంగళవారం వదిలి వెళ్ళింది.  బాలుడైన మహమ్మద్ హుస్సేన్ ఇంటి ముందర బుధవారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రమైనా కూడా ఇంటికి రాకపోవడంతో తల్లి సమీనా బేగం తన కూతురు కు తెలపడంతో చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికి దొరకలేదు. దీంతో ఐదవ టౌన్ లో ఫిర్యాదు చేశారు.  బాలుడు3.5 ఫీట్స్ ఎత్తు, ఎరుపు కలర్ టీ షర్ట్, బ్లూ కలర్ జీన్ పాయింట్ ధరించి ఉన్నాడు. ఈ ఘటనపై 5 వ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి ఆచూకీ ఎవరికైనా లభించినచో 5 వ టౌన్ పి‌ఎస్ ఎస్ఎచ్ఓ నంబరు 8712659844 కు గాని, పీఎస్ ఫోన్ నంబర్ 8712659727 కు గాని సంప్రదించవలసిందిగా 5 వ టౌన్ ఎస్ఐ ఎం.గంగాధర్ తెలిపారు.

More articles

Latest article