29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

డిగ్రీ అడ్మిషన్లకు అపూర్వ స్పందన

Must read

📰 Generate e-Paper Clip

  • లైఫ్ సైన్స్, బీబీఏ గ్రూప్ లలో వంద శాతం అడ్మిషన్లు పూర్తి
  • ఫిజికల్ సైన్స్ లో పరిమిత సంఖ్యలోనే ఖాళీలు
  • ఈ నెల 26 చివరి గడువు
  • ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్

 

నిజామాబాద్, బతుకమ్మ: గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు ఈ విద్యా సంవత్సరంలో అపూర్వ స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ ప్రకటించారు. లైఫ్ సెన్సస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 140 సీట్లలో గిరిజన బాలికలు పోటీపడి మరీ అడ్మిషన్లు పొందారన్నారు. మునుపెన్నడూ లేని రీతిలో అడ్మిషన్ల ప్రక్రియ సాగడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది వేసవి సెలవుల్లోనూ విస్తృత ప్రచారం నిర్వహించి అడ్మిషన్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారన్నారు. ఫిజికల్ సైన్స్ విభాగాల్లో ప్రస్తుతానికి పరిమిత సంఖ్యలో మాత్రమే సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 26 లోపు విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్, రిజిస్ట్రేషన్ రుసుము తీసుకుని వస్తే వెంటనే అడ్మిషన్ కల్పిస్తామన్నారు.

More articles

Latest article