25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎన్ఎస్యుఐ పోరాటంతోనే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో ఎన్ఎస్యుఐ కీలక పాత్ర పోషించిందని డీసీసీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ, నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కాట్‌పల్లి నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోరాటానికి అన్ని విధాలుగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకుండా, వారిని దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు అంటూ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమని నగేష్ రెడ్డి విమర్శించారు. విదేశీ పెట్టుబడులు విద్యార్థుల ఉద్యమాల వెనుక ఉన్నాయంటూ చేసిన ఆరోపణలు బాధ్యతారహితమైనవని పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు, ప్రజలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్లమెంట్‌లో ఎన్ డిఎ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించి, వాటిని వెనక్కి తీసుకునేలా చేసిన ఘనత ఆయనదేనని నగేష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్లు శేఖర్ గౌడ్, కవిత రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్త వత్సలం, ఉపాధ్యక్షులు శరత్, జిల్లా ముఖ్య నాయకులు యాదగిరి, విపుల్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రత్నాకర్ గౌడ్, మోయిన్, గణేష్, సుభాష్, సాయికుమార్, కిష్టా గౌడ్, సంతోష్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

More articles

Latest article