27.2 C
Hyderabad

ఎల్లారెడ్డిలో ఓటు హక్కు పరిరక్షణ కోసం భారీ నిరసన

Massive protest in Yella Reddy to protect voting rights

Must read

📰 Generate e-Paper Clip

. . . ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు బ్లాక్ షర్టులు ధరించి పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ నిరసనను వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నేతృత్వంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన హక్కు అని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు కూడా తొలగిపోకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల వ్యవస్థపై ఉందని అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కు పరిరక్షణ, పారదర్శకమైన ఓటర్ల జాబితా, ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని నాయకులు తెలిపారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు,ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Massive protest in Yella Reddy to protect voting rights
Massive protest in Yella Reddy to protect voting rights

More articles

Latest article