26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పచ్చని పొలాలలో అక్రమంగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నాలా కన్వర్షన్ లేకున్నా యథేచ్చగా నిర్మాణాలు

 

. . . లేఅవుట్ అడిగేవాడు లేడు

 

. . . తీర్మాన్ పల్లీ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండలంలోని వివిధ గ్రామాలలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని మండలానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందల్వాయి మండలంలోని తీర్మాన్ పల్లి గ్రామంలో పచ్చని పొలాల నడుమ అక్రమ నిర్మాణం కొనసాగుతున్న ప్రభుత్వ అనుమతి మంజూరు చేశారని చెప్తూ యదేచ్చగా నిర్మాణం కొనసాగిస్తున్న పట్టించుకున్న నాథుడు కరువయ్యారు. ఇందల్వాయి నుండి ధర్పల్లి వైపు వెళ్లే ప్రధాన రోడ్డులో ప్రభుత్వ అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. ఒక పక్క అసైన్డ్ భూములలో సైతం కమర్షియల్ బిల్డింగులు నిర్మాణం జరుగుతున్న పట్టించుకున్న అధికారి లేకపోవడం గమనార్హం. మరోపక్క పచ్చని పొలాల నడుమ ఎలాంటి నాలా పర్మిషన్ లేకుండా, లేఅవుట్ అనుమతులు లేకుండా కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించేందుకు సైతం సిద్ధమయ్యారు. దీంతో మండలానికి చెందిన కొందరు చిన్నపాటి బాత్రూం నిర్మించుకోవాలంటే సవాలక్ష అనుమతులు అడుగుతున్న ప్రభుత్వం కనీసం కమర్షియల్ కాంప్లెక్స్ లు యెదెచ్చగా నిర్మాణం అవుతున్న పట్టించుకున్న పాపానలేదని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనుమతుల పేరుతో స్థానిక అధికారులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇంటి దొంగలను పట్టుకొని శాఖపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మాన్ పల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. కంచె చేను మేసే విధంగా అధికారులు తయారయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి రావలసిన ఆదాయం సగానికి పైగా ప్రైవేట్ వ్యక్తులకు సొంతమవుతుందని దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకొని విచారణ జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. ఇందల్వాయి ఎంపీడీవో అనంతరావు తో పాటు తహసిల్దార్ బాలయ్యలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

More articles

Latest article