27.5 C
Hyderabad
Friday, July 31, 2026

కేంద్రమంత్రి బండి సంజయ్ వాఖ్యలు రాష్ట్రాల హక్కులు హరించేలా ఉన్నాయి

Must read

📰 Generate e-Paper Clip

  • రాజ్యాంగం పట్టుకు తిరుగుతున్నరాహుల్ గాంధిని తెలంగాణకు ఆహ్వనిస్తున్నాం
  • ఆసిఫాబాద్ మత కల్లోలాల గురించి ఏ నేత మాట్లాడటం లేదు
  • బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

 

హైద్రాబాద్, బతుకమ్మ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయము అని అన్నారు.. ఇది రాష్ట్రాల హక్కులను హరించడం కాదా అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని హైద్రాబాద్ లో భారత రాజ్యాంగం పై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని… కింద స్థాయిలో పథకాలు అమలు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కాదా  అని అన్నారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనే మాట మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగంలో ఉన్న ఫెడరల్ స్ఫూర్తి ఏమైనట్లు అని బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం వాటికి లేదు అని కవిత పేర్కోన్నారు. పాకెట్ డైరీలా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతూ రాజ్యాంగాన్ని కాపాడాలి అని అంటున్నారు.. నేను ఆయనను తెలంగాణకు స్వాగతిస్తున్న అన్నారు.

Union Minister Bandi Sanjay's remarks are like taking away the rights of states

మీరు రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు.. మీరు చెబుతున్న రాజ్యాంగాన్ని ముందు తెలంగాణలో కాపాడండి తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా.. మీరు చెబుతున్న రాజ్యాంగ విలువలు ముందు ఇక్కడ కాపాడండి  అని కోరారు. కొన్ని నెలల క్రితం ఆసిఫాబాద్లో మతకల్లోహాలు జరిగి వందలాది మంది నిరాశ్రయులయ్యారు.. వాళ్ల గురించి ఒక్క నాయకుడు కూడా మాట్లాడటం లేదు అని ఎమ్మెల్సీ కవిత అవేధన వ్యక్తం చేశారు.ఆసిఫాబాద్ లో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి వాళ్లకు ఎలాంటి ఆర్థిక సహాయం గానీ నష్టపరిహారం కానీ అందలేదు…  ప్రభుత్వ పెద్దలు కనీసం వాళ్లను పరామర్శించలేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కనీసం అటు వైపు చూడలేదు.. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కుతున్నారు అని గుర్తు చేశారు. రాజ్యాంగ విలువలని తుంగలో తొక్కే ప్రభుత్వాలు ఉన్న ఈ సందర్భంలో విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని చేయడాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని కవిత అన్నారు.

 

Union Minister Bandi Sanjay's remarks are like taking away the rights of states

More articles

Latest article