29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

గుర్తు తెలియని మహిళ అనుమానాస్పదస్థితిలో మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • అత్యాచారం చేసి హత్య చేశారని అనుమానాలు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగు చూసింది. నగరంలోని స్టేషన్ రోడ్డులోని  ఒక కాంప్లెక్స్ ఎదురుగా రైల్వే శాఖకు చెందిన నిర్మాణుష్య ప్రదేశంలో  గుర్తు తెలియని మహిళ చనిపోయి రోజులు గడస్తుండటంతో దుర్వాసన వస్తున్నట్టు స్థానికులు పోలీస్ లకు సమాచారం అందించారు. బుధవారం సాయంత్రం ఒకటవ టౌన్ పొలీస్ లు ఘటన స్థలానికి  చేరుకుని పరిశీలించారు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వివాహిత అనుమానస్పద  స్థితిలో మృతి చెందినట్లు గుర్తించారు. మహిళ ఉన్న స్థితిలో ఆమెపై అత్యాచారం, హత్య అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహిళ హత్యకు గురై నాలుగు నుంచి ఐదు రోజులు గడిచాయని అందుకే కుళ్లిపోయే స్థితిలో ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసు కొలిక్కి తీసుకురావడానికి మిస్సింగ్ కేసులను పరిశీలించే పనిలో పడ్డారు. స్థానిక స్టేషన్ రోడ్డులో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డా కావడంతోనే మహిళ హత్య విషయం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.

More articles

Latest article