బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డొంకల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్ మాట్లాడుతూ పాఠశాల విద్య జీవితంలో మరపురానిదని, గురువులు చెప్పిన విషయాలు నిత్యజీవితంలో గుర్తుంచుకొని భావి జీవితంలో అత్యున్నత స్థానంలో నిలవాలని, పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి. వేణుగోపాల్ రావు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు మనోధైర్యంగా రాసి మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని తెలియజేసినారు. 9, 10వ తరగతి విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించినాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేష్ కుమార్,చంద్రశేఖర్, నరసింహ స్వామి, రాజేందర్,జయశ్రీ,త్రివేణి,మమత, రాజేశ్వరి, నచ్చయ్య ఆఫీసు సిబ్బంది సైఫ్ అలీ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
