27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మాదిగలకు 11శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్ :-మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ మాదిగల జనాభా 32 లక్షలుగా ఉండగా, వారికి 11% రిజర్వేషన్లు రావాలని, కానీ ప్రస్తుత కమిషన్ సిఫార్సుల్లో 9% మాత్రమే కల్పించారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చట్టం చేయకుండా మాదిగలను మోసం చేస్తే మాత్రం రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. వేల్పూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్షలు 7వ రోజు కు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షులు తెడ్డు శివరాజ్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్, ప్రశాంత్, సుమన్ భాస్కర్, రాహుల్, సుజిత్, పరమేష్, బాబు,రాజు అనుదీప్, మండల నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article