పాఠశాల విద్యా జీవితంలో మరపురానిది
బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డొంకల్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్ మాట్లాడుతూ పాఠశాల విద్య జీవితంలో మరపురానిదని, గురువులు చెప్పిన విషయాలు నిత్యజీవితంలో గుర్తుంచుకొని భావి జీవితంలో అత్యున్నత స్థానంలో నిలవాలని, పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్లెపాటి. వేణుగోపాల్ రావు మాట్లాడుతూ పదవ...