మోర్తాడ్, బతుకమ్మ :
సెర్పు ఐకెపి జిల్లా సీసీల యూనియన్ అధ్యక్షుడిగా మోర్తాడ్ మండల సిసి తడకాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా ఎల్1, ఎల్2 ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మోర్తాడ్ మండలంలోని ఐకేపీ కార్యాలయంలో సిబ్బంది మిఠాయిలు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యాలయంలో సీసీలు మహేందర్, గాజుల శ్రీనివాస్, అకౌంటెంట్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
