- కామాంధునిపై పొక్సో కేసు నమోదు
భీమ్ గల్, బతుకమ్మ : అభం, శుభం తెలియని బాలికపై ఓ కామంధుడు ఆత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన మండలంలోని బడా భీమ్ గల్ లో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి.భీమ్ గల్ పట్టణ కేంద్రానికి చెందిన ఓ మైనర్ బాలిక ఏడవ తరగతి వరకు చదివి, పొట్ట కూటికోసం పట్టణంలో కాలి సీసాలు, ప్లాస్టిక్ వస్తువులు, అట్టలు, స్క్రాప్ వస్తువులను ఏరుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో గత కొన్ని రోజుల క్రితం తన నానమ్మ ఇంటికని బడా భీమ్ గల్ వెళ్ళింది. అక్కడ ఓ వ్యక్తితో పరిచయం కాగా, ఆ వ్యక్తి ఈ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి బలవంతంగా మానభంగం చేసాడు. దాంతో బాలికకు ఇటీవలే కడుపునొప్పి రాగ ఆసుపత్రిలో చూపించిగా బాలిక గర్భవతి అని వైద్యులు నిర్ధారించారు. ఇట్టి విషయమై భాధితులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా ఆ కామంధునిపై పోలీసులు పొక్సో కేసు నమోదు చేశారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కేసు విచారణ చేపట్టారు.
