27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు

Must read

📰 Generate e-Paper Clip

గాంధారి, బతుకమ్మ : ప్లే గ్రౌండ్ లో ఆడుకోవడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను టాటా ఏస్ ఢీకొని గాయపడిన ఘటన గురువారం గాంధారి లో చోటుచేసుకుంది. గాంధారిలోని కన్వర్టెడ్ ఆశ్రమ పాఠలలో మూడో తరగతి చదువుతున్న కళ్యాణ్, నాలుగో తరగతి చదువుతున్న అర్జన్ గురువారం సాయంత్రం ప్లే గ్రౌండ్ లో ఆడుకోవాడనికి వెళుతున్నారు. రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో వేగంగా వస్తున్న ఏపీ 09 టీఏ 3387 నంబర్ గల టాటా ఏస్ విద్యార్థులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే గాయపడిన విద్యార్థులను మెరుగైన వ్యైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్నకామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ రోడ్డు ప్రమాదంలో గాయపడిని విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందిచాలని వైద్యాధికారులను ఆదేశించారు.

More articles

Latest article